పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ రాజకీయం రసవత్తరంగా ఉంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. దీంతో పాలకొల్లులో వైసీపీ వ్యూహం మారిపోయింది. గత మూడేళ్లుగా ఆ వ్యూహ రచనలో భాగంగా అనేక ఎత్తుగడలు వేసింది అధికారపార్టీ. అయితే పార్టీ కేడర్ ఆలోచన మరోలా ఉందట. వ్యూహాలు చాలు.. అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేస్తే ఆ మేరకు పని మొదలుపెడతామని చెబుతున్నారట.…