కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె ఎయిర్‌పోర్టులో తన తండ్రికి రాసిన లేఖపై స్పందించారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్త పర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేశారు. లేఖ బహీర్గతం కావడం బాధాకరమన్నారు. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్,…
మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.