ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్‌ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్‌తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.