సంగీత ప్రియులందరికీ సుపరిచితమైన పేరు కవితాకృష్ణమూర్తి. సినిమా సంగీతం,పాప్ మ్యూజిక్, వెస్ట్రన్, ట్రెడిషనల్ ఇలా ఏ పేరుతో పిలుచుకొనే సంగీతాన్ని అభిమానించే వారికైనా కవితాకృష్ణమూర్తి మధురగానం సదా మదిలో మెదలుతూనే ఉంటుంది. జనవరి 25న 64 ఏళ్లు పూర్తి చేసుకున్న కవితాకృష్ణమూర్తి ఇటీవలే ప్రఖ్యాత గాయకులు మహమ్మద్ రఫీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రఫీ సాబ్ తో తన అనుభవాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో తాను ఎంతో చిన్నపిల్లనైనా, రఫీ సాబ్ ఎంతగానో ప్రోత్సహించారనీ కవిత మననం…