అక్కడ టీడీపీ లీడర్లకు కొదవ లేదు. కానీ.. వారిపై కేడర్‌కే క్లారిటీ లేదు. ఎవరు పార్టీని లీడ్ చేస్తారో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థెవరో తెలియక సతమతం చెందుతున్నారట. ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారట తమ్ముళ్లు. కావలిలో టీడీపీ కేడర్‌కు దిశానిర్దేశం లేదా?ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావలి. అలాంటిచోట సైకిల్ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. బీద మస్తానరావు పార్టీని వీడి వెళ్లాక…