దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చేపట్టింది. భద్రత, దాని సామర్థ్యం పెంపు కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవని చెప్తున్నారు.…