Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది.