Food Poisoning: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపు 80 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు గురయ్యారు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే వారు విద్యార్థినులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన వారు భీంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు.…