కార్వీ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు ను ఆశ్రయించారు కార్వీ ఎండి పార్థసారథి. బెంగుళూరు పోలీసుల పిటి వారెంట్ ను సవాలు చేస్తూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు పార్థసారథి. అనారోగ్య కారణల వలన బెంగుళూరు పోలీసుల విచారణ కు సహాకరించలేనని హైకోర్టు కు తెలిపారు కార్వి ఎండి పార్థసారథి. ఈ నేపథ్యంలోనే బెంగుళూరు పోలీసులకు ఇచ్చిన పిటి వారెంట్ ను రద్దు చేసింది హైకోర్టు. ఇక…
కార్వి ఎండిని కస్టడీ లోకి తీసుకున్నారు పోలీసులు. కార్వీ ఎండీ పార్థసారథిని చంచల్ గూడా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. రెండు రోజుల సీసీఎస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రెండు రోజులపాటు పార్థసారథిని ప్రశ్నించనున్న పోలీసులు… చంచల్ గూడ జైలు నుండి సీసీఎస్ కు తరలిస్తున్నారు పోలీసులు. మూడు వేల కోట్ల రూపాయల స్కాంపై పూర్తి వివరాలు రాబట్టనున్నారు సీసీఎస్ పోలీసులు. డీ మాట్ అకౌంట్ ఖాతాదారుల డిపాజిట్లను తనఖా పెట్టి రకరకాల…