స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రాబోతోంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో హీరో కార్తీ ప్రేక్షకులని అలరిస్తున్నారు.