Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు.…
స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రాబోతోంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో హీరో కార్తీ ప్రేక్షకులని అలరిస్తున్నారు.