దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా, వారి ఆయుధ కర్మాగారాలకు , ముఖ్య నాయకులకు షెల్టర్ జోన్‌గా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంలో భాగంగా, వెంకటాపురం మండలం పామునూరు గ్రామ పరిధిలోని కర్రెగుట్టలపై నూతనంగా ఎఫ్.ఓ.బి (FOB) బేస్ క్యాంప్‌ను అధికారులు ప్రారంభించారు. సి.ఆర్.పి.ఎఫ్ (CRPF) 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బేస్ క్యాంప్‌ను…