ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. టికెట్ ఆశించడం తప్పుకాదని, తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తామని అన్నారు.