Karnataka Minister Slaps Woman: కొంతమంది నేతల దురుసు ప్రవర్తన ఆయా పార్టీలకు చేటు తెస్తున్నాయి. అధికారం తలకెక్కిన నాయకులు ప్రజలతో ఎలా నడుచుకోవాలనేది తెలియడం లేదు. ఆగ్రహంతో ప్రజలను దూషించడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు ఓ మంత్రి. అధికారంలో ఉన్న వ్యక్తి, మంత్రి అయి ఉండీ మహిళ చెంపపై కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ…