Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం కావేరిలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ వివాదం మరోసారి వేడెక్కింది. హైకమాండ్ డీకే శివకుమార్‌ను 2.5 సంవత్సరాలు వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు సిద్ధరామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించలేకపోతుందనే వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పంద కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదటి రెండునరేళ్ల…
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ప్రచారానికి తెరపడింది. ఈ ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘ఎక్స్’ పోస్ట్‌తో ముగింపు పలికారు. సీఎంగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. తామంతా ఆయనకు సహకరిస్తామని ఈ సందర్భంగా డీకే శివకుమార్ వెల్లడించారు. READ ALSO: iBomma Case: ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై మరో నాలుగు కేసులు నమోదు… ఈ ప్రకటన వెలువడక ముందు వరకు కూడా కర్ణాటకలో పవర్…
Karnataka Congress in Turmoil: కర్ణాటకలో పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్ నెలకొంది. కర్ణాటక ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ వర్గాల తలపోటుగా మారిన విషయం తెలిసిందే. హైకమాండ్ వైపే మేమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు…
Karnataka CM Change: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్‌కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కొరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే…