తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన పాదయాత్ర 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది.
ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎంఓ ఆదేశాలతో అరెస్ట్ చేయడం పై నిరసన దీక్షలు జరుగుతున్నాయని అన్నారు. కుంటి సాకులతో అర్థం పర్థం లేని ఆరోపణలుతో సంగ్రామ యాత్ర కు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల్ని కలవాల్సిన ముఖ్యమంత్రి వాలని కలవలేదు, పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం వల్లనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని…