ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని…
MLC Kavitha : కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని, ఓసీలు, ఎస్సీ ల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఆమె కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ లకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్…
Fraud : క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేష్ గౌడ్ వ్యవహారం మరో విషయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరు చెప్పి కరీంనగర్ వరంగల్ జిల్లాలో 100 కోట్లు వసూలు చేశాడు రమేష్. రమేష్ ని కాపాడేందుకు సీఐడీ అధికారుల ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్‌లో కేసు నమోదు అయినప్పటికీ అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. నిందితుడైన రమేష్ తో…
ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ నెల 22 న జగిత్యాలలోని శివప్రసాద్ అనే వ్యక్తం తన నివాసంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువతులు మృత్యువాత పడ్డారు. జగిత్యాల పట్టణంలోని గాంధీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురి యువతుల మృతిచెందారు. ఇందులో ఇద్దరికి వివాహం కాగా, ఇంకో యువతి ఇంటర్ చదువుతోంది. మరణించిన వారిలో ఎక్కల్ దేవి గంగాజల, మల్లిక ల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో యువతి వందన మృత దేహం కోసం గాలింపు కొనసాగుతోంది. యువతుల మృతి ఘటనపై…