ఒక కేసును విచారిస్తున్నప్పుడు, హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవడానికి 'కన్యాదానం' అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చట్టం ప్రకారం, కేవలం 'సప్తపది' (ఏడడుగులు) మాత్రమే హిందూ వివాహానికి అవసరమైన వేడుక అని పేర్కొంది.