ఏపీలో పలువురు కీలక పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటికే.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా మరో ఇద్దరిని బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, బెజవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో.. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పీఎస్సార్, బెజవాడ సీపీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ఈసీ వేటు వేసిన ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల విధులు…