ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న “కాంతార చాప్టర్-1”. నటుడు–దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ డివోషనల్ డ్రామా, ఇప్పటికే విడుదల కానుందన్న వార్తలతోనే విశేషమైన అంచనాలను క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన కాంతార సినిమాకు వచ్చిన అపారమైన విజయాన్ని అందరూ గుర్తుంచుకున్నారు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఆ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో సంచలన హిట్టయింది.…