పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.