కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 296 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. తద్వారా 49 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. 129/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కుదురుగా ఆడనివ్వలేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆడేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారు. Read Also: ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోనుంది? 151 పరుగుల…
కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సులో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్ (75), లాథమ్ (50) ఉన్నారు. వీరిద్దరూ అర్థసెంచరీలు చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 57 ఓవర్లు వేసినా టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే కివీస్ 216 పరుగులు వెనుకబడి ఉంది. Read Also:…
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. జడేజా 100 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేసి క్రీజులో…
న్యూజిలాండ్ ను ఈ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 25 న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులోకి మరో ఆటగాడిని తీసుకోబుతుంది బీసీసీఐ అని ఓ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టులో మంచి టచ్ ఉన్న…