Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్‌ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యాలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు.