(ఆగస్టు 25తో ‘శ్రీకృష్ణతులాభారము’కు 55 ఏళ్ళు పూర్తి) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు వినగానే ముందుగా ఆయన ధరించిన పురాణపురుషుల పాత్రలే గుర్తుకు వస్తాయి. వాటిలో యన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణ పాత్ర అన్నిటికన్నా ముందుగా స్ఫురిస్తుంది. శ్రీకృష్ణ పాత్రలో దాదాపు పాతిక సార్లు తెరపై కనిపించిన ఘనత యన్టీఆర్ సొంతం. 55 ఏళ్ళ క్రితం నవరసాలనూ ఒలికిస్తూ యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రను అభినయించిన ‘శ్రీకృష్ణతులాభారము’ చిత్రం జనాన్ని విశేషంగా అలరించింది. అంతకు ముందు యన్టీఆర్…