గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టేజ్‌పై సూపర్ ఎనర్జీతో మాట్లాడడం, డ్యాన్స్ చేయడం రణవీర్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన చేసిన ఈ జోష్ కన్నడ ప్రేక్షకులను అస్సలు నచ్చలేదు. రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ ఇస్తూ మాట్లాడిన రణవీర్‌ను అక్కడివాళ్లు బాగా చప్పట్లు కొట్టారు. కానీ మాటల మధ్యలో, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసే దైవిక…