Kanna Lakshminarayana: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి సొంత పార్టీ నేతను టార్గెట్ చేశారు.. కాపు రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అసలు ఏం సాధించారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు? అని నిలదీశారు.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన కన్న.. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నాం.. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారు.. అత్యధిక శాతం ఉన్న…
Off The Record: ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కదలికలు రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంటే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జనసేన, టీడీపీ శిబిరాల్లో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీద ఒంటికాలిపై లేస్తున్నారు. బీజేపీ నుంచి బయటకెళ్లేందుకే ఆయన ఆ విధమైన కామెంట్స్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. బీజేపీ తనపై వేటు వేస్తే భవిష్యత్ రాజకీయాల దిశగా కన్నా అడుగులు వేస్తారని అనుకుంటున్నారు. ఇదే సమయంలో…
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ... అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.
Andhra Pradesh BJP:ఏపీ బీజేపీ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందా? రాజధాని అమరావతి విషయంలో బీజేపీని అక్కడి రైతులు ఎందుకు తప్పు పడుతున్నారు? ప్రతికూల రాజకీయ వాతావరణంలో పాదయాత్రతో కమలనాథులకు ప్రయోజనం ఉందా? సోము వీర్రాజుకు రైతులు ఇచ్చిన షాక్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?
మాజీ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా.. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు సీఎం రేసులో నిలబడిన కన్నా లక్ష్మీనారాయణ మౌనం కేడర్‌కు అర్థం కావడం లేదట. గతంలో ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరసగా గెలిచారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్నారు. 2009లో అక్కడి నుంచి కూడా గెలిచారు కన్నా. మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కొంత ఇబ్బంది పడ్డారు.…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోంది. జగన్ రైతులను గాలికొదిలేశారు. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారు అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు అని తెలిపారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం…
సీఎం జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోలేదు అని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను…