Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.