రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన వివాదాస్పద ప్రకటనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఆమె మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త వివాదం సృష్టించారు.