బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే.…