Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్…
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2024 అక్టోబర్ 10న అతనికి 29 ఏళ్లు నిండాయి. కాగా.. గులామ్ తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 13వ పాక్ క్రికెటర్‌గా నిలిచాడు.