మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?.. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళలో పర్యటించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం పాపం చేశారని మా పార్టీలోని కాపు నేతలను ఇబ్బంది పెడుతున్నారు..? అని మండిపడ్డారు..…