కామారెడ్డి ఇష్యూ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. MCHRD లో జరుగుతున్న పట్టణ ప్రగతి వర్క్ షాప్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ కామారెడ్డి ఇష్యూ పై మాట్లాడుతూ.. ఆ సమస్య ఎందుకు వచ్చిందని కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.