పాపులర్ తెలుగు సినిమాల టైటిల్స్ ను డబ్బింగ్ సినిమాలకు ఉపయోగించడం మామూలే! ఆ మధ్య కార్తీ సినిమాకు ‘ఖైదీ’ అనే పేరు పెట్టారు. అలానే దుల్కార్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ‘వరణే అవశ్యముంద్’ ను తెలుగులో డబ్ చేస్తూ నిర్మాతలు ‘వరుడు కావాలి’ అనే టైటిల్ పెట్టారు. ఈ నెల 24న ఆహాలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టూ ప్రకటించారు. అయితే… ఇప్పటికే తెలుగులో నాగశౌర్య, రీతువర్మ జంటగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘వరుడు…
మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి…