దుల్కర్ సల్మాన్ మూవీ టైటిల్ మారింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ తెలుగు సినిమాల టైటిల్స్ ను డబ్బింగ్ సినిమాలకు ఉపయోగించడం మామూలే! ఆ మధ్య కార్తీ సినిమాకు ‘ఖైదీ’ అనే పేరు పెట్టారు. అలానే దుల్కార్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ‘వరణే అవశ్యముంద్’ ను తెలుగులో డబ్ చేస్తూ నిర్మాతలు ‘వరుడు కావాలి’ అనే టైటిల్ పెట్టారు. ఈ నెల 24న ఆహాలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టూ ప్రకటించారు. అయితే… ఇప్పటికే తెలుగులో నాగశౌర్య, రీతువర్మ జంటగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘వరుడు కావలెను’ మూవీని నిర్మిస్తోంది. అతి త్వరలో ఇది కూడా జనం ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ మూవీ ‘వరుడు కావాలి’ ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నా ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కు గురయ్యే ఆస్కారం ఉంది. బహుశా అందుకే కావచ్చు… ‘వరుడు కావాలి’కి సంబంధించిన ప్రకటన వచ్చిన మర్నాడే ఈ మూవీ పేరును ‘పరిణయం’గా మార్చి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. సో… ఆహాలో ఈ నెల 24న దుల్కర్ సల్మాన్, కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
మరో విశేషం ఏమంటే.. 2020 వాలెంటైన్స్ డే సందర్భంగా ‘వరణే అవశ్యముంద్’ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. దీనికి హీరో దుల్కర్ సల్మానే నిర్మాత కూడా కావడం విశేషం. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాతో అనూప్ సత్యన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఐదేళ్ళ గ్యాప్ తర్వాత ఈ మూవీతోనే సురేశ్ గోపీ నటుడిగా రీ-ఎంట్రీ ఇచ్చాడు. అలానే సురేశ్ గోపీ, శోభన జంట 15 యేళ్ళ విరామం తర్వాత ఈ మూవీలో మరోసారి జోడీ కట్టడం మరో విశేషం.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!


తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!