ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు దుబాయ్‌లో గ్రాండ్ గా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. పలువురు నటీమణులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ,…
సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డులలో ‘సైమా అవార్డ్స్’ (SIIMA Awards) ఒకటి. ఈ అవార్డ్స్ ప్రత్యేకత ఏంటంటే.. దక్షిణ భారతీయ భాషల్లో వచ్చిన సినిమాలకే అవార్డులు అందజేశారు. ఫలితంగా, దక్షిణాది చిత్రసీమలోని నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ అవార్డులను ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే 12 ఎడిషన్లు పూర్తయిన ఈ అవార్డుల వేడుక, 13వ ఎడిషన్‌గా ఈసారి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గత ఏడాది…