విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం పసుపు రంగు సైకిల్ మీద ‘సైకిల్ యాత్రగా’ అమరావతి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రైతుకు నిదర్శనగా, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ ఎంపీ కలిశెట్టి సభా ప్రాంగణానికి బయలుదేరారు. ఒక ఎంపీగా, నగర పౌరుడుగా, రైతుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని అన్నారు. రాజధాని అమరావతి ప్రపంచంలోనే కీలకపాత్ర పోషిస్తుందని ఎంపీ కలిశెట్టి చెప్పుకొచ్చారు. ఎంపీ కలిశెట్టి…
గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. అయితే కలిసొచ్చి కుర్చీలో కూర్చున్నా…. దాన్ని ఎలా వాడుకోవాలో అర్ధంగాక తికమకలు, మకతికలు పడుతున్నారట ఆ ఎంపీసాబ్. పబ్లిసిటీ మోజులో తెగ పరేషాన్ అయిపోతూ…. అసలు తానేం చేస్తున్నానో… తన స్థాయి ఏంటో కూడా మర్చిపోయి సొంత పార్టీ ముఖ్యులకే అంతు చిక్కని పజిల్‌లా మారారాట. చివరికి చంద్రబాబు, లోకేష్ కూడా అతన్నెవరన్నా అపండర్రా….అని మొత్తుకోవాల్సి వస్తోందా? ఎవరా ఎంపీ? అంత తలనొప్పి పనులేం చేస్తున్నారు? కలిశెట్టి అప్పలనాయుడు….. విజయనగరం టీడీపీ…
విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ... అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.