విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం పసుపు రంగు సైకిల్ మీద ‘సైకిల్ యాత్రగా’ అమరావతి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రైతుకు నిదర్శనగా, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ ఎంపీ కలిశెట్టి సభా ప్రాంగణానికి బయలుదేరారు. ఒక ఎంపీగా, నగర పౌరుడుగా, రైతుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని అన్నారు. రాజధాని అమరావతి ప్రపంచంలోనే కీలకపాత్ర పోషిస్తుందని ఎంపీ కలిశెట్టి చెప్పుకొచ్చారు.
ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు ముక్కలాట ఆడింది. మన రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి తీసుకువచ్చాడు వైఎస్ జగన్. మళ్లీ అమరావతికి పునర్ వైభవం వచ్చింది. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా రూపొందుతున్నాయి. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీ రావడం శుభపరిణామం. విజయనగరంలో ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, పలు నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఒక ఎంపీగా, నగర పౌరుడుగా, రైతుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నందుకు గర్విస్తున్నాను’ అని చెప్పారు.