Rajalinga Moorthy Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర,ఉమ్మడి జిల్లా,జిల్లా కమిటీ ల నేతలు శుక్రవారం కలిశారు. రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజనిర్ధారణ చేసుకునేందుకే పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జరిగిన హత్యపై పలువురు స్థానికులను, రాజలింగమూర్తి భార్యను కలిసి వివరాలు సేకరించుకున్నాము,మరికొంత సమాచారం కొరకు పోలీసులను కూడా కలవనున్నామని తెలిపారు. సామాజిక కార్యకర్తగా…