కాకినాడ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు (మం) పోతులూరు, కొడవలి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. పులిని బంధించే వరకు రైతులు పొలాల వైపు వెళ్లొద్దని ఎంపీ సూచించారు. 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రకటించారు. పులిబారినపడి చనిపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఎంపీ గీత. మరోవైపు ప్రత్తిపాడు వద్ద పులి…