కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ-సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ కావడంతో సమాజ్‌వాదీ ఎంపీ ఇక్రా హసన్ స్పందించారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు.