లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై గత రెండు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ట్రాకియోస్టోమీ శస్త్ర చికిత్స జరుగుతోంది. ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి కైకాలకు ఐసీయూలో వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం జరుగుతోంది. కైకాల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అపోలో హాస్పిటల్స్ అధికారులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బులెటిన్‌లో కైకాల స్పృహతో ఉన్నారని, అయితే ఇప్పటికీ తక్కువ రక్తపోటు ఉందని, వాసోప్రెసర్ సపోర్ట్ పై…
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిన్న ఆయన ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆస్పత్రి నుంచి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అప్పటి నుంచి కైకాల అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా కైకాల త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. అందులో…
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనే ఏమి చెప్పలేని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందజేస్తున్నామని, ఆయనను కాపాడడానికి డాక్టర్స్ అందరు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలిపారు. కైకాల ఆరోగ్యం బాగుపడాలని, ఆయన మంచిగా కోలుకోవాలని అభిమానులు…
గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలు జారిపడి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సికింద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1959లో సిపాయి కూతరు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన మొన్న వచ్చిన అరుంధతి సినిమా వరకు వివిధ పాత్రల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటనకు ‘నవరసనటనా సార్వభౌమ’ ‘కళా ప్రపూర్ణ’ ‘నటశేఖర’ లాంటి బిరుదులు వరించాయి. ఆయన ఇప్పటివరకు…
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థత పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లో జారిపడినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి పెయిన్స్ ఎక్కువగా వుండడంతో సికింద్రాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. కైకాల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో ఆయన చివరి సారిగా కన్పించారు. Read Also…
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.