బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది?…