కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు..