పోలీస్ శాఖలో ఏపీ ప్రభుత్వం కీలక బదిలీలను చేపట్టింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ప్రభుత్వం… తాజాగా కడప జైలు ఇంఛార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వరుణారెడ్డి ఒంగోలు జైలర్‌గా బదిలీ అయ్యారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రకాష్‌ను కడప జైలర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు…