ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి…