ఓ వైపు అమెరికా తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. 31 తరువాత అమెరికా లేని ఆఫ్గానిస్తాన్‌ని ప్రపంచం చూస్తుంది. కానీ ఆఫ్గన్ ప్రజలకు మాత్రం మళ్లీ నరకం మొదలవుతుంది. మళ్లీ అంతర్యుద్ధంతో అట్టుడుకుతుంది. ఉగ్రతండాలు ఊళ్లకు ఊళ్లను కభళిస్తాయి. అందుకే ఇప్పుడే ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు ఆఫ్ఘన్ ప్రజలు. అందుకోసం దారులు వెతుకుతున్నారు. చావటానికైనా సిద్ధమే కానీ నరకూపం లాంటి చోట ఉండలేమని సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. నరకకూపం లాంటి ఆఫ్గనిస్తాన్‌లో ఉండటానికి అక్కడి ప్రజలు…