Taliban Minister Rehman Haqqani Killed: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో తాలిబాన్ ప్రభుత్వంలోని శరణార్థుల వ్యవహారాల మంత్రి మరణించారు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారాన్ని వెల్లడించారు. మంత్రిత్వ శాఖలో పేలుడు సంభవించడంతో శరణార్థుల వ్యవహారాల మంత్రి ఖలీల్ హక్కానీ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడులో అతని ముగ్గురు అంగరక్షకులు సహా 12 మంది మరణించారు. మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత…
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి.
కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
100 children killed in suicide bombing at Kabul school: ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కు చేరినట్లు తెలుస్తోంది. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఏ- బర్చి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి సమయంలో మొత్తం స్కూల్ లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధం…
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాకేంద్రం వద్ద భారీ పేలుడు సంభవించింది.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది మృతిచెందారు. ఈ పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది మరణించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 8 మంది గాయపడినట్లు సమాచారం.
Kabul Blast: వరుస పేలుళ్లతో అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్ నగరంలో నిన్న సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో భారీ పేలుడు సంభవించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈఘటనతో అఫ్గానిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక ఖైర్ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈభారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు…