కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే Ramp’ సినిమా, దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కిరణ్ అబ్బవరంకి మరో హిట్ అందించింది. గట్టిగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 15వ తేదీ, అంటే వచ్చే శనివారం నాడు, ఆహాలో స్ట్రీమింగ్కి రెడీ అవ్వనుంది. ఈ మేరకు ఆహా ద్వారానే అధికారిక ప్రకటన…