ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ రోజు రాత్రికి అది తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని… దీని ప్రభావంతో రాగల 3 రోజులు పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు…