జయ జయ శంకర… శివ శివ శంకర… శంభో శంకర.. హర హర మహాదేవ.. శివ శివ శంకర.. హరహర శంకర అంటూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈనెల 12వ తేదీన ప్రారంభమయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తిటీవీ కోటి దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు జ్వాలాతోరణం వీక్షిస్తూ పరవశించారు. నిండుపున్నమి వెలుగులో శ్రీశైల మల్లన్న…